ఈ ఒక్క ఆకుని ఉపయోగిస్తే చాలు ఊడిన జుట్టు కూడా మళ్లీ వస్తుంది.

ఆరోగ్య సమస్యలు, టెన్షన్, ఆఫీస్ ఒత్తిళ్ళు ఇతర కారణాలన్నింటితో వాటన్నింటి ప్రభావం ముందుగా మన చర్మం, జుట్టుపైనే పడుతుంది. ఇలా అనేక కారణాలతో జుట్టు ఊడుతుంటుంది. ఒక్కసారి సమస్య ప్రారంభం అయిందంటే తిరిగి మామూలు స్థితికి రావడానికి చాలా టైమ్ పడుతుంది. కాబట్టి ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ సమస్య ప్రారంభం అయితే.. కొన్ని ఇంటి చిట్కాలను వాడొచ్చు. జుట్టు రాలే సమస్యకి మంచి టిప్ గురించి తెలుసుకు


పొడవైన, బలమైన జుట్టు అంటే అందరికీ ఇష్టమే. దీని కోసం రకరకాల షాంపూలు, నూనెల వాడుతుంటారు. అయినప్పటికీ పెద్దగా ఫలితం ఉండదు. ఇలాంటప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే ఫలితం ఉంటుంది. చాలా మూలికల్లో మనకు తెలియని ఎన్నో అద్భుత గుణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మన అందానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇలాంటి ఒక మొక్క గురించే ఇప్పుడు తెలుసుకుందాం.. అదే గుంటగలగర ఆకు..
గుంటగలగర ఆకు ఎక్కువ పొలాల్లో దగ్గర్లో ఉంటుంది. సిటీల్లో ఉండేవారు తెలిసిన వారితో తెప్పించుకోవచ్చు. దీన్ని వాడడం వల్ల జుట్టు అందంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. ఏవైనా ఆరోగ్య సమస్యలతో ఊడిపోయిన జుట్టు కూడా తిరిగి పెరుగుతుంది. అందుకోసం మనం ఏం చేయాలంటే.. ముందుగా గుంటగలగర ఆకుని తీసుకోవాలి. ఇది మీకు ఇష్టమైన పరిమాణంలో తీసుకోవచ్చు. కొలత ఏం అవసరం లేదు.. కావాలంటే.. ఓ పెద్ద బౌల్ నిండా ఆకుని తీసుకోవాలి. దీనిని నీటితో బాగా శుభ్రంగా కడుక్కోవాలి.. కాస్తా నీరు పోయేవరకూ ఉంచి దానిని మెత్తగా మిక్సీ పట్టుకోవచ్చు