కరోనాపై ట్విట్టర్ యుద్ధం.. ప్రజల కోసం వినూత్న ప్రచారం

కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది.. మన దేశంలోనూ పంజా విసురుతోంది. ఈ మహమ్మారి తరిమికొట్టేందుకు యావత్ భారతం ఒక్కటైంది.. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటూ వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు పెద్ద యుద్ధమే చేస్తున్నారు. లాక్‌డౌన్‌ ప్రకటించి ఇంట్లో నుంచి బయటకు రావొద్దని సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావిత దేశాలు కూడా లాక్‌డౌన్‌ను పాటిస్తున్నాయి.


ప్రభుత్వాలకు తోడు హ్యాష్‌టాగ్స్, ఎమోజీని ప్రపంచవ్యాప్తంగా వినూత్నంగా ప్రచారం చేస్తోంది. అంతేకాదు వివిధ ప్రాంతీయ భాషల్లో కూడా హ్యాష్ ట్యాగ్స్‌ను రూపొందించింది. మొత్తం పది భాషల్లో వీటిని సిద్ధం చేసింది. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్ సమయంలో ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితం కావాలని కోరుతోంది.